Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే, ప్రతివారం కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతూ ఉంటాయి; ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ లాంటి సీనియర్ నటీమణులతో పాటు యంగ్ యాక్టర్స్ వంశీ, రవి శివతేజ, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘హ్యాపీ జర్నీ’, రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ‘అనుమానపక్షి’ సినిమాలతో పాటు, సూర్య శ్రీనివాస్, నిహాల్ కోదాటి హీరోలుగా ‘సీక్రెట్ సోల్జర్’ లాంటి సినిమాలతో పాటు, బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్ అన్ష్ సినిమా తెలుగులో రిలీజ్‌కి రెడీ అయ్యాయి.
అయితే సెన్సార్ అధికారి ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్న కారణంగా, ఇందులో కొన్ని సినిమాలకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఆ సినిమాలు రిలీజ్ అవుతాయా, వాయిదా పడతాయా అనే విషయం మీద క్లారిటీ లేదు. సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ అయి సర్తేటిఫికేట్ చేతికి వస్తే ఆ సినిమాలు ఈ వారమే, అంటే ఎల్లుండి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్‌పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- Feel My Love: స్వచ్ఛమైన ప్రేమకథతో ఐదు భాషల్లో రిలీజ్'కు సిద్ధమైన 'ఫీల్ మై లవ్'..!
లేదంటే కనుక, సెన్సార్ ఫార్మాలిటీస్ ఆలస్యం అయితే కనుక వచ్చే వారానికి వాయిదా పడక తప్పని పరిస్థితి. అయితే వచ్చే వారమే ‘పారడైజ్’ సినిమా ఉంది కాబట్టి, ఈ సినిమాలు ఆ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్‌కి రెడీ అవుతాయా లేక ఇంకాస్త వెనక్కి వెళ్తాయా అనే విషయం మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అయితే సెన్సార్ అధికారి అందుబాటులోకి వచ్చిన వెంటనే సెన్సార్ చేయించడానికి టీమ్స్ అయితే సిద్ధమవుతున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. కానీ ముందే కంటెంట్ రెడీ చేసుకుని సెన్సార్ కు వెళ్లి ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులు, లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పేవని అంటున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!