Tollywood : పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటిలోని ముఖ్యాంశాలు

Tollywood (1)

Tollywood (1)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందిన ఐదుగురు సీనీ నిర్మాతలు రవి శంకర్, సూర్య దేవర నాగవంశి, సాహు గారపాటి, సతీష్ కుమార్ తదితరుల బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాజమండ్రి లోని షెల్టాన్ హోటల్ లో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పవన్ తో భేటీ అనంతరం నిర్మాతలు  మాట్లాడుతూ..రెండు వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు అన్ని పవన్ తో చర్చించాము, పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పూర్తి పరిష్కారాలు వస్తాయని నిర్మాతలు కంగారు పడాల్సిన అవసరం లేదని పవన్ భరోసా ఇచ్చారు.

అలాగే మల్టీప్లెక్స్ మోడల్‌లా లాభాల్లో కొంత పర్సెంటేజ్ షేరింగ్ అమలు చేస్తే సింగిల్ స్క్రీన్స్  నిలబడతాయని పవన్ కళ్యాణ్ కు వివరించాము.కేవలం పెద్ది సినిమా గురించి మాత్రమే చర్చించలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లాము. ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ సంబంధించిన వివాదాలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని పవన్ హామీ ఇచ్చారు. పెద్ది సినిమాకు కూడా ఐదు షోలకు పర్మిషన్ ఉంది. సింగిల్ స్క్రీన్స్ పెద్ధి సినిమా సంబంధించి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం ఉంది ప్రస్తుతం ఎటువంటి ఆటంకం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను తీర్చే విధంగా పరిష్కారాలకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. అలాగే ఈ అంశాలపై దృష్టి పెట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు సూచించారు పవన్ కళ్యాణ్.