Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood Pan World Movies Trend Mahesh Babu Allu Arjun Prabhas Nani Nrt Prashanth Neel

Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?

Published Date :April 22, 2026 , 4:57 pm
By Bhargav Chaganti
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్ వంటి సినిమాలు ఇప్పుడు ఈ వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల బడ్జెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. టాప్ హీరోల రెమ్యునరేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన VFX కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం సౌత్ ఇండియన్ మార్కెట్‌తో ఈ పెట్టుబడిని వెనక్కి రాబట్టడం కష్టంగా మారుతోంది. అందుకే విదేశీ మార్కెట్‌పై కన్నేసి, అక్కడ కూడా రిలీజ్ చేయడం ద్వారా బడ్జెట్‌ను కవర్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఎక్కువ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆటోమేటిక్ గా డిజిటల్ రైట్స్ (OTT) ధరలు పెరుగుతాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు గ్లోబల్ అప్పీల్ ఉన్న సినిమాలకు భారీ ఆఫర్లు ఇస్తుండటంతో, నిర్మాతలు ‘పాన్ వరల్డ్’ ట్యాగ్‌ను మార్కెటింగ్ అస్త్రంగా వాడుకుంటున్నారు.
రాజమౌళి – మహేష్ బాబు (వారణాసి)కి ‘పాన్ ఇంటర్నేషనల్ మూవీ’గా బీజం పడింది. కెన్యా అడవుల్లో షూటింగ్, దాదాపు 120 దేశాల్లో విడుదల చేయాలన్న ప్లాన్‌తో రాజమౌళి గ్లోబల్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్తున్నారు. అల్లు అర్జున్ – రాకా (RAKA) హాలీవుడ్ నిపుణులతో VFX వర్క్ చేయిస్తూ, గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ – స్పిరిట్ చైనా, జపాన్, కొరియా దేశాల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా ఈ రేసులో చేరారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో కూడా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుందని నిర్మాతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

Also Read

  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
  • Bloody Romeo: నాని 'బ్లడీ రోమియో'కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
  • Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా - డిస్కో శాంతి

గతంలో ‘కల్కి 2898 AD’, ‘హనుమాన్’ వంటి చిత్రాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ భారీగా ప్రచారం చేశాయి. కానీ ఆశించిన స్థాయిలో విదేశీ భాషల్లో లేదా అంతర్జాతీయ మార్కెట్‌లో అవి ప్రభావం చూపలేకపోయాయి. కేవలం ప్రచారం కోసమే ‘పాన్ వరల్డ్’ అని పిలుచుకోవడం వల్ల లాభం లేదని, కంటెంట్‌లో కూడా ఆ గ్లోబల్ కనెక్టివిటీ ఉండాలని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగే క్రమంలో ఉన్నారనడంలో సందేహం లేదు. అయితే, ఈ పాన్ వరల్డ్ ఫార్ములా కేవలం బడ్జెట్‌ను కవర్ చేసే ‘నెంబర్ గేమ్’గా మారుతుందా లేక నిజంగానే తెలుగు సినిమా జెండాను ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తుందా అనేది వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #dragon
  • 2026 Telugu Movies
  • Allu Arjun
  • Box Office Trends
  • global cinema

తాజావార్తలు

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

  • Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions