Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్‌కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా కోసం సిన్సియర్‌గా పనిచేసే హీరోలు, హీరోయిన్స్ యాక్షన్ సీన్స్ కోసం డూప్‌లను కూడా పక్కన పెట్టి రిస్క్ తీసుకుంటారు. కానీ ఆ రిస్క్ ఒక్కోసారి భారీ గాయాలుగా మారుతుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK111 షూటింగ్ కాకినాడ పోర్ట్‌లో జరుగుతుండగా జూలై 21న భారీ ఫైట్ సీన్ చిత్రీకరణలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా బాలకృష్ణ కాలు జారి కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ మోకాలిలో క్వాడ్రిసెప్స్ టెండన్ టియర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం హైదరాబాద్‌లో మూడు గంటల పాటు సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దీంతో సినిమా షెడ్యూల్‌కు దాదాపు రెండు నెలల బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.
ఇక యంగ్ టైగర్ జూనియర్ డ్రాగన్ షూటింగ్ టైమ్ లో భుజానికి గాయం అయింది. దాంతో ఎన్టీఆర్ కు మైనర్ సర్జరీ చేశారు వైద్యులు. దాదాపుగా ఎనిమిది వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు. దాంతో ఎన్టీఆర్ లేని సీన్స్ ను షూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్లో రెజ్లింగ్, యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా రామ్ చరణ్ కుడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. పరీక్షల్లో TFCC కార్టిలేజ్ టియర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో అత్యాధునిక ఆర్థ్రోస్కోపిక్ విధానంలో సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్. దాదాపు 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే అంటే రెండు మూడు నెళ్ల తర్వాతే సుకుమార్ దర్శకత్వంలోని RC17 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ రశ్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రణబాలి, మైసా చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు చేయడం వల్ల రశ్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది. గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!