Tollywood Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొదవ లేదు. ప్రతి నెల బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. నవంబర్ నెల పూర్తి కావొస్తున్న నేపథ్యంలో చివరి వారంలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి? ఏ రోజున ఏ మూవీ రాబోతుందో ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం.
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే దాదాపు 11 సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి కొత్త సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ‘హే కన్నమ్మ’ సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ధనశ్రీ వర్మ, కార్తీక మురళీధరన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో పాటుగా ‘సిద్దుగాడి లవ్ స్టోరీ’, ‘బాల 369’, ‘హై’, ‘ఐ హేట్ మ్యారేజ్’, ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమాలు వస్తున్నాయి. అలాగే ‘ఆలోచన’ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది.
తెలుగులో స్ట్రెయిట్‌గా తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతుండగా, మిగిలిన సినిమాలు వేరే భాషల నుంచి తెలుగులో డబ్ అవుతున్నాయి. ‘పూలే’ సినిమాతో పాటుగా విజయ్ ఆంటోనీ నటించిన ‘నాన్న కుట్టి’ పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదల అవుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, అటు తమిళంలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ‘606’, ‘చిట్టుకురింజి’, ‘డెలివరీ బాయ్’, ‘సిగ్నల్ ఎట్ 11.30’ వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. మరి వీటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా ఏ మూవీ నిలుస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

