ఆయనకు 42, ఆమెకు 22. ఏదో సినిమా టైటిల్ లాగా ఉందని అనుకోరు కాదండోయ్. నిజానికి సినీ పరిశ్రమలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని సినీ పరిశ్రమ వరకే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే, ఆయన ఓ సినిమా రైటర్, వయసు 42. ఆమె ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ యంగ్ అమ్మాయి, వయసు 22. వారిద్దరూ ఒకే డైరెక్టర్ కోసం పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.
Also Read:GlobeTrotter in 120 countries: సాధ్యమయ్యే పనేనా?
అయితే, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వారిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. ఒకరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరొకరు జన్మించారు. దాదాపు రెండు దశాబ్దాల ఏజ్ గ్యాప్‌తో ఉన్న వీరి ప్రేమ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, ఈ రోజుల్లో ఏజ్ గ్యాప్ అనేది పెద్ద విషయమేమీ కాదు. రెండు మనసులు కలవాలి, కానీ దశాబ్దాల ఏజ్ గ్యాప్ కూడా పెద్ద విషయమేమీ కాదు. అయితే, సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమ కథలు మొదలవుతాయి అవి ప్రేమ కథలుగానే మిగిలిపోతాయి. కొన్ని ప్రేమలు పెళ్లిళ్ల వరకు వెళితే, కొన్ని పెళ్లికి ముందే ముగిసిపోతాయి. అయితే, మరి ఈ జంట పెళ్లి వరకు వెళ్తుందా, లేక ప్రేమ కథగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.