NTV Telugu Site icon

Tollywood : సినిమా ‘లీక్స్’ జరుగుతున్నాయా.. కావాలనే చేస్తున్నారా..?

Leak

Leak

టాలీవుడ్ ఇండస్ట్రీని లీకుల భూతం వదలట్లేదు. ఎన్ని ప్రికార్షన్స్ తీసుకున్నా.. కట్టుదిట్టమైన కండిషన్లు పెట్టినా.. షూటింగ్ పిక్స్, వీడియోస్ బయటకు వచ్చేస్తున్నాయి. రీసెంట్‌గా రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన యాక్టర్స్ పిక్స్ లీక్ అయ్యాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీక్స్ ఎందుకు జరుగుతున్నాయి.. కావాలనే చేస్తున్నారా…? స్ట్రాటజీలో భాగమేనా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

Also Read : Dance IKON2 : ఆహా OTT డాన్స్ ఐకాన్ – 2 వచ్చేస్తోంది.. ఈ సారి హోస్ట్ ఎవరంటే..?

ఇటీవల లీక్ కు  గురైన సినిమాలను పరిశీలిస్తే మోస్ట్  ఎగ్జ్గైటెడ్, ఎవైటెడ్ మూవీగా మారిన పుష్ప 2.  ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్న స్పెషల్ సాంగ్   షూటింగ్ జరగ్గా.. ఆ పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఆ పిక్స్ ఫైర్ పుట్టించడమే కాదు.. పుష్ప 2పై అంచనాలు డబుల్ చేశాయి. ఇంతలో మరో మూవీ పిక్ కూడా లీకైంది.మంచు విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది కన్నప్ప. భారీ బడ్జెట్, రిచ్ లోకేషన్స్, భారీ కాస్టింగ్‌తో బిల్డ్ అవుతోన్న ఈ మూవీ లో కీ రోల్ ప్లే చేస్తున్న ప్రభాస్ లుక్ బయటకు వచ్చేసింది. నుదుటిపై విభూతితో, బరువైన రుద్రమాలతో.. ఇంచు మించు శివుని వేషధారణలో కనిపిస్తున్నాడు డార్లింగ్. ఈ లుక్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read : Balayya : ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ డేట్ ఇదే

షూటింగ్ టైంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీక్ కావడంపై చర్చ జరుగుతుంది. ఇవి కావాలనే చేస్తున్నారని, సినిమాపై అటెన్షన్ పెంచుకునేందుకు ఓ స్ట్రాటజీలా వినియోగిస్తున్నారన్న టాక్ నడుస్తుంది. గతంలో హిందీ రామాయణ కోసం రణబీర్, సాయి పల్లవి లుక్ టెస్ట్ చేయగా.. పిక్స్ లీక్ అయ్యాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం యూనిట్టే వాటిని లీక్ చేసిందన్న వార్తలు వచ్చాయి. సినిమాపై క్యూరియాసిటీ, పబ్లిసిటీ, హైప్ పెంచేందుకు ఇలాంటి జిమ్మిక్స్ చేస్తున్నారని కొందరి వాదన మరి  కావాలనే ఈ పిక్స్ లీక్ చేసిందంటారా..?

Show comments