Balayya : ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ డేట్ ఇదే
- కెరీర్ లో 109వ సినిమా చేస్తున్న బాలయ్య
- NBK 109 కు దర్శకత్వం వహిస్తున్న బాబీ
- సంక్రాంతి కానుకగా రిలీజ్ ఫిక్స్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్నారు ‘గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్నారు. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని, ‘NBK109’ పై అంచనాలను రెట్టింపు చేశాయి. పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కార్తీక పూర్ణిమకి వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా టైటిల్ టీజర్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.
Also Read : Megastar : జపాన్ కు మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే..?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ 15న ‘NBK109’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ .
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!