Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్” అంటూ స్టార్ హీరోలు స్క్రీన్‌ని బ్లడ్ బాత్ చేసేస్తుంటే, ఆ స్టార్స్ మాత్రం వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక తెలుగు ఆడియన్స్ ఉన్నారా? ఈ చేంజ్ తాత్కాలికమేనా? టాలీవుడ్లో వైలెన్స్ సినిమాల కన్నా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ నుంచి ‘ఇరుముడి’ వరకు చూస్తే ఇదే నిజం అనిపించక మానదు. రవితేజ ఎన్నో మాస్ ప్రయత్నాలు చేసి, చివరకు ఫ్యామిలీ టచ్ ఇచ్చేసరికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయి, ‘ఇరుముడి’కి 250 నుంచి 300 కోట్ల కలెక్షన్లు కట్టబెట్టారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ థియేటర్స్‌కి వచ్చేలా చేసింది ఈ మూవీ. వైలెన్స్‌తో మాత్రమే కాదు, మనసుకు హత్తుకుపోయే కంటెంట్ ఇస్తే కాసులు కురిపించొచ్చు అని టాలీవుడ్‌కు పాఠాలు నేర్పింది ఈ సినిమా.
రవితేజ మాస్‌ని వీడి ఫ్యామిలీ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టడంతో, నితిన్ కూడా యాక్షన్ హీరో నుంచి టర్న్ తీసుకుంటున్నాడు. ‘భీష్మ’ తర్వాత రకరకాల జాన్రాస్ ట్రై చేసి చేతులు కాల్చుకున్న నితిన్, సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ‘అలియాస్ రుక్మిణి’ ఆఫర్ అవ్వడంతో టక్కున ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ కోసం కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా మేకోవర్ అయ్యాడు. దీనికి నాని హెల్ప్ తోడైంది. తనకు దూరమైన ఫ్యామిలీ ఆడియన్స్‌ను ‘అలియాస్ రుక్మిణి’తో నితిన్‌కు చేరువ చేసేందుకు ట్రై చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. భీభత్సమైన వైలెన్స్ జోలికి వెళ్ళకపోయినా, కిరణ్ అబ్బవరం కూడా యాక్షన్ హీరో అనిపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేశాడు. వర్కవుట్ కాకపోయేసరికి ‘క’, ‘K రాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’లతో లవర్ బాయ్‌గా మారాడు. ఇదే చట్రంలో ఇరుక్కుపోకుండా, నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌గా ఫ్యామిలీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. యాక్షన్‌కు కట్ చెప్పడం మొదలు పెడుతూనే మంచి కుటుంబ కథా చిత్రంతో ‘రియాలిటీ’లోకి వచ్చేసాడు. టాలీవుడ్ హీరోల్లో ఈ మార్పులకు కారణం, బహుశా ఆడియన్స్ పల్స్ తెలిసిందనుకుంటా! మరి ఈ చేంజ్ ఒక్క సినిమాకే పరిమితం చేస్తారా? నెక్స్ట్ సినిమాలకు కూడా కంటిన్యూ చేస్తారా? వెయిట్ అండ్ సీ!
Also Read
- Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే 'కిల్లర్' కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
- Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
- Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ 'మెగావర్స్'.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
- Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్'గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
తాజావార్తలు
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..
-
Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!