టాలీవుడ్ హీరోలు చాలామంది ఒకపక్క హీరోలుగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ సంస్థలు మొదలు పెడుతున్నారు. ఆ నిర్మాణ సంస్థలతో కొంతమంది హీరోలు బయటి హీరోలతో సినిమాలు చేస్తుంటే, మరికొంతమంది హీరోలు మాత్రం తాము చేసే సినిమాలకు రెమ్యూనరేషన్లు తీసుకోకుండా ఆ నిర్మాణ సంస్థను సహ-నిర్మాణ సంస్థగా చేసి సినిమాలో వచ్చే లాభాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా యంగ్ హీరోలైన సందీప్ కిషన్ లాంటి వాళ్లకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
Also Read:Sekhar Kammula: ఆ హీరోతో ఏషియన్లోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్!
అలాగే, దాదాపుగా ప్రతి హీరో బంధువు లేదా స్నేహితుడు ప్రారంభించిన నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే, హీరో రామ్ సొంత బాబాయ్ రవి కిషోర్ శ్రావంతి మూవీస్ బ్యానర్ మీద ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. నిజానికి ఆయన వారసుడిగానే రామ్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఇప్పుడు రామ్ తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Nagarjuna : కుబేరలో నాదే మెయిన్ రోల్.. నాగార్జున కామెంట్స్
అయితే, ఆ బ్యానర్‌లో కొత్త సినిమాను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని, ఒక కొత్త కుర్రాడు దర్శకుడిగా ఈ సినిమా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఆ సినిమాలో రామ్ నటిస్తాడా లేక వేరే హీరోని ప్లాన్ చేశారా అనే విషయంపై క్లారిటీ లేదు. అలాగే, రామ్ హీరోగా నటించే సినిమాలను పూర్తిగా రామ్ నిర్మాతగా నిర్మిస్తాడా లేక ఇతర నిర్మాతలతో కలిసి ఇతర హీరోల లాగానే ప్రాజెక్టులు చేస్తాడా అనేది కూడా చూడాల్సి ఉంది.