Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్‌మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్‌కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్‌గా మారింది. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. హీరోలతో నిలబడి దిగే ఈ ఫోటోలు నిజంగానే బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెంపుతాయా? కేవలం ఫోటోలు ఇస్తే కలెక్షన్ల వర్షం కురిసిపోతుందా?
సినిమాకు సినిమాకు గ్యాప్.. సోషల్ మీడియా కోసమేనా
ఇటీవల కాలంలో హీరోలు వరుసగా సినిమాలు చేయడం దాదాపు తగ్గిపోయింది. ఒక్కో ప్రాజెక్టు పట్టాలెక్కి థియేటర్‌కు రావడానికి కనీసం రెండేళ్ల నుంచి మూడేళ్లు పడుతోంది. ఇంత లాంగ్ గ్యాప్ వస్తే ఫ్యాన్స్‌లో క్రేజ్ ఎక్కడ చల్లారిపోతుందోనన్న భయం హీరోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే రిలీజ్ దగ్గరపడుతున్న వేళ ఫ్యాన్స్‌ను కలిసి ముచ్చటించి, ఫోటోలు ఇస్తే సోషల్ మీడియాలో ఒక్కసారిగా బజ్ క్రియేట్ అవుతుందనేది వీరి ప్లాన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోతో దిగిన ఫోటోను ప్రతి ఒక్కరూ తమ ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్లలో పోస్ట్ చేయడం వల్ల రూపాయి ఖర్చు లేకుండా సినిమాకు కావాల్సినంత డిజిటల్ ప్రచారం క్షణాల్లో జరిగిపోతుంది. అందుకే దీన్నొక పక్కా స్ట్రాటజీలా వాడుకుంటున్నారనే టాక్ ఉంది.
Also Read
- The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా 'ది ట్రైటర్స్'
- Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
- Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
- Srinidhi Shetty: 'ఆదర్శ కుటుంబం' డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
మొన్న ‘ది ప్యారడైజ్’ టైంలో నాని ఓపికగా అందరినీ కలిసి ఫోటోలు ఇచ్చి ఈ ట్రెండ్‌కు ఊపునిచ్చారు. ఆ తర్వాత ‘రణబాలి’ సినిమా కోసం విజయ్ దేవరకొండ – రష్మిక జోడీ కూడా ఇదే రూట్ ఫాలో అయ్యారు. తాజాగా ‘కల్ట్’ సినిమా కోసం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా సారథి స్టూడియోస్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టారు. కానీ జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి చివరకు ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ఒక హీరో మీటింగ్‌కు వెళ్లి ఫోటోలు దిగిన వాళ్లే, మరుసటి రోజు మరో హీరో మీట్‌కు వెళ్లి క్యూలలో నిలబడుతున్నారు. ఏ హీరో మీట్ పెట్టినా అక్కడ ఒకే మొహాలు కనిపిస్తుండటం విడ్డూరంగా మారింది. కేవలం సోషల్ మీడియాలో డీపీలు మార్చుకోవడానికి, లైకులు, కామెంట్ల కోసం హీరోల దగ్గర ఫోటోలు దిగే వీళ్లను అసలు నిజమైన అభిమానులు అని ఎలా అనగలం? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. హీరోల పట్ల ఉండే నిజమైన అభిమానం కంటే.. ఒక సెలబ్రిటీ పక్కన నిలబడి ఫోటో దిగి నెట్టింట షో చేసుకోవాలనే తాపత్రయమే ఎక్కువైందని అంటున్నారు.
ఫోటోలు వేరు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ వేరు..
హీరోలతో ఫోటోలు దిగడానికి వేలాది మంది జనం ఎగబడొచ్చు.. కానీ ఆ హంగామా అంతా ఫస్ట్ డే ఓపెనింగ్స్‌కు మాత్రమే కాస్త తోడ్పడుతుంది. అంతేకానీ కేవలం ఫోటోలు ఇచ్చారని సాధారణ జనాలు థియేటర్లకు పరుగులు తీయరు. థియేటర్లలో టికెట్లు తెగాలంటే కథలో దమ్ముండాలి, కంటెంట్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు దాన్ని నెత్తిన పెట్టుకుంటారు తప్ప.. ప్రమోషన్ల కోసం హీరోలు ఇచ్చే ఫోటోలను చూసి ఎవరూ సినిమాకు వెళ్లరనేది కాదనలేని నిజం. అభిమానులను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం మంచిదే అయినా.. కనీస భద్రతా ఏర్పాట్లు చేయకుండా వాళ్లను రిస్క్‌లో పడేయడం, కేవలం సినిమా హైప్ కోసమే వాళ్లను వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన విషయం అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ఫ్యాన్స్ మీట్లు పెట్టినా పెట్టకపోయినా సినిమా ఆడుతుంది.. అదే కథలో సత్తా లేకపోతే ఎన్ని వేల ఫోటోలు ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద ఫలితం శూన్యమే అవుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
-
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!