Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత గుజ్జలపూడి హరి (47) నేడు ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన ఇలా అనంత లోకాలకు వెళ్లడం టాలీవుడ్ పంపిణీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఒక యువ డిస్ట్రిబ్యూటర్ మరణ వార్త వినగానే ఇండస్ట్రీ వర్గాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. దీనికి
నెల్లూరు జిల్లాకు చెందిన గుజ్జలపూడి హరి.. టాలీవుడ్లో ‘హరి వెంకటేశ్వర పిక్చర్స్’ అనే ప్రఖ్యాత పంపిణీ సంస్థను స్థాపించి డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్ర స్థానానికి ఎదిగారు. సినిమా బిజినెస్‌పై ఉన్న పట్టుతో తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు), అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్ వంటి పెద్ద పెద్ద బ్యానర్ల నుండి వచ్చిన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఆయన నెల్లూరు ఏరియాలో పంపిణీ చేసి ఘన విజయాలను అందుకున్నారు. గుజ్జలపూడి హరి కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలతో అత్యంత బలమైన.. వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉండేవారు. పంపిణీ రంగంలో రాణిస్తూనే, ఆయన తమిళంలో విజయవంతమైన పలు క్రేజీ చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు ఏరియాలో ఏ పెద్ద సినిమా రిలీజ్ కావాలన్నా హరి పేరు ముందంజలో ఉండేది. అలాంటి ఒక టాలెంటెడ్ పంపిణీదారుడు ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం నెల్లూరు ట్రేడ్ వర్గాలకు, టాలీవుడ్‌కు తీరని లోటు అని చెప్పాలి.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
దీంతో గుజ్జలపూడి హరి మరణవార్త తెలియగానే టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. “గుజ్జలపూడి హరికుమార్ గారి ఆకస్మిక మరణవార్త నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలతో ఆయనకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ఎమోషనల్ గా సంతాపం వ్యక్తం చేశారు. నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు మరియు పంపిణీదారులు హరి భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని చెప్తున్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోకసంతప్తులైన వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!