NTV Telugu Site icon

Tollywood : ఉగాది రేస్ లో ముగ్గురు హీరోలు.. గెలుపెవరిదో..?

Tollywood

Tollywood

గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. త్రీ స్టార్ హీరోస్ బరిలోకి దిగి  పీపుల్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీనే రిపీట్ కాబోతుందా అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సంక్రాంతికి కోడి పుంజుల్లాంటి మూడు సినిమాలొచ్చాయి. చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ ఢాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను కలర్ ఫుల్ చేశాయి.

Also Read : Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు

ఉగాదికి ఇద్దరు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు తలపడబోతున్నారు. ఈ ఏడాది మోస్ట్ ఎవటైడ్ మూవీ హరి హర వీర మల్లు మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండవుతుంది. ఇక పవర్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్ నితిన్ కూడా ఇదే డేట్ కన్ఫమ్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌కు రావాల్సిన నితిన్ రాబిన్ హుడ్  పుష్ప 2 దెబ్బకు అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి సంక్రాంతికి రావాలనుకుంది. కానీ సెట్ కాలేదు. ఫిబ్రవరి మార్చికా అన్న కన్ఫ్యూజన్‌లో ఉండగా ఓ కంక్లూజన్‌కు వచ్చేసింది. మార్చి 28కే రాబిన్ హుడ్‌ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నాడు నితిన్. రీసెంట్లీ ఈ అఫీషియల్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. పవన్, నితిన్ తో పాటు ముగ్గురు యంగ్ హీరోలు ఉగాదికే వచ్చేస్తున్నారు. మ్యాడ్ తో మ్యాడెనెస్ క్రియేట్ చేసిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్  మ్యాడ్ స్క్వేర్  మార్చి 29న రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ఉగాదిని కలర్ ఫుల్ చేసేందుకు, క్యాష్ చేసుకునేందుకు బాక్సాఫీస్ సమరంలోకి దూకేస్తున్నారు.