బాలీవుడ్ రేంజ్ ఒకప్పుడు ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. వారి బడ్జెట్లు, బిజినెస్,వసూళ్లు మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేది. దీంతో అప్పుడు సౌత్ సినిమాలను నార్త్ వాళ్ళు చాలా తక్కువగా చూసి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి సీన్ మారిపోయింది. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది హిందీ హీరోలు టాలీవుడ్‌లో అవకాశాలకోసం ఎదురుచుస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ ఇలా ఒక్కసారిగా నేలమీద పడటానికి గల కారణం ఇదే అంటూ.. ఒక వేడుకలో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు..
Also Read: Vijay Antony : మరో కొత్త కాన్సెప్ట్‌తో విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ టీజర్..
బాలీవుడ్ ఇంతగా వెనకపడిపోడారికి కారణం ఏంటీ అనే ప్రశ్న తలెత్తగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మూవీ దక్షిణాది, ఉత్తరాది అనేది పెద్ద విషయం కాదు. కానీ ఓటీటీల వల్లనే బాలీవుడ్ వెనుకబడడానికి ప్రధాన కారణం అని మాత్రం చెప్పగలను. దయచేసి థియేటర్‌కు వచ్చి మా సినిమాలు చూడండి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత ఎంచక్కా టీవీలో సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకే వచ్చి సినిమా చూసేవాళ్లు. మూవీ లాస్ట్ డే ని తెలుసుకొని మరి వెళ్లేవారు. టీవిలో వచ్చేవరకు మళ్ళి ఆ మూవీ చూడలేము అనే ఒక ఆందోళన అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు రావట్లేదు. ఎక్కడి నుంచైనా సినిమా చూడొచ్చు అనే ఈ బిజినెస్ మోడల్‌తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం. హిందీ చిత్ర దర్శకులు మరింత ఎక్కువ మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో మూలాలను మరిచిపోతున్నారు’ అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.