Nikhil Siddharth : దీపావళి రేస్ లో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’..
- సైలెంట్ గా సినిమా ఫినిష్ చేసిన నిఖిల్
- దీపావళి రిలీజ్ రేస్ లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
- టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు స్వామి రారా, కేశవ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటం విశేషం.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి తమ 32 వ చిత్రంగా దీన్ని రూపొందిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కారుకు సంబంధించిన అంశాలను ఇందులో ఉన్నాయని తెలుస్తుంది.
Also Read
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
Also Read : Ashok Galla : మహేష్ బాబు మేనల్లుడి ‘దేవకినందనవాసుదేవ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఫస్ట్ లుక్‌ను గమనిస్తే హీరో నిఖిల్, హీరోయిన్ రుక్మిణి వసంత్ నడుస్తూ వస్తున్నారు. నిఖిల్ స్టైలిష్ లుక్‌ను ఉంటే, రుక్మిణి వసంత్ గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు. ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. స్వామిరారా, కేశవ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో రాబోతున్న సినిమా కావటంతో ఆడియెన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ హిట్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావటంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టటానికి సంసిద్ధమయ్యారు.
కన్నడ సినీ హీరోయిన్ రుక్మిణి వసంత్ .. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోంది. హర్ష చెముడు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్. బాపినీడు.బి ఈ చిత్రానికి సమర్పణ. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.
Also Read :Gopichand: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్.. సన్న పిన్ను ఛార్జర్ ఉందా..?
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!