Bellamkonda Suresh: తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా, ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ కారు చోరీకి గురై వార్తల్లో నిలిచారు. బెల్లంకొండ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం ముందు తన బెంజ్ కారును పార్క్ చేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కారు వెనుక అద్దం పగిలి ఉండడాన్ని గమనించారు.