Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ గురించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షూటింగ్ షెడ్యూల్ జూలై 7 నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో సినిమాకే హైలైట్‌గా నిలిచే ఒక భారీ యుద్ధాన్ని చిత్రీకరించేందుకు జక్కన్న టీమ్ అంతా సిద్ధం చేసినట్టుగా టాక్. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం గత కొన్ని వారాలుగా చిత్రబృందం ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
ఈ సీక్వెన్స్‌లో మహేష్ బాబుతో పాటు ఏకంగా 3,500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారట. రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లలోని యాక్షన్ సీన్లను సైతం మించిపోయేలా, ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని రీతిలో ఈ వార్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీక్వెన్స్‌లో అసలైన హైలైట్ మరొకటి ఉంది. సెట్స్‌పై 3500 మందితో చిత్రీకరించే ఈ సన్నివేశాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వెండితెరపై ఓ రేంజ్లో చూపించబోతున్నారట. ఈ సినిమాలో రామాయణ ఎపిసోడ్ మామూలుగా ఉండదనే టాక్ ఉండనే ఉంది. ఇప్పుడు షూట్ చేయబోయే సీక్వెన్స్‌ను విఎఫ్ఎక్స్ ద్వారా ఏకంగా 50,000 మంది వానర సైన్యాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారని సమాచారం. రాజమౌళి మార్క్ గ్రాండియర్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్‌కు థియేటర్లు బ్లాస్ట్ అవడం పక్కా అంటున్నారు. మరి 2027 ఏప్రిల్ 7న రానున్న వారణాసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!