వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ ను ఇతర హీరోల సినిమాల ఈవెంట్స్ లో చూడడమే తప్ప ఆయన నటించిన సినిమా ఈవెంట్ లో చూసి చాలా సంవత్సరాలు అయింది. ఆ ఆకలిని వార్ 2 తో తెచ్చేసాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేసాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసాడు ఎన్టీఆర్.
Also Read : WAR 2 : ఒకటి కాదు.. రెండు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడానికి రెడీ అవండి
అయితే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ కు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆ విషయాన్నిస్వయంగా ఎన్టీఆర్ పలు సందర్భాలలో కూడా చెప్పాడు. లేటెస్ట్ గా వార్ 2 ఈవెంట్ కు కూడా ఓ ఖరీదైన వాచ్ ను ధరించి వచ్చాడు ఎన్టీఆర్. ఇక ఈ వాచ్ బ్రాండ్ తో పటు దాని ధర ఏంటని గూగుల్ లో సెర్చ్ లు మొదలయ్యాయి. కాగా ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ ‘అడిమార్స్ పిగుట రాయల్’ బ్రాండ్ వాచ్. దాని ధర అక్షరాలా మూడు కోట్ల, నలభై ఐదు లక్షల డెబ్భై ఏడువేల ఎనిమిదివందల ఒక్కరూపాయి (రూ. 3. 45 కోట్లు ). ఈ ఖరీదుతో ఒక చిన్న సినిమా కూడా తీయచ్చు అని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 మరో మూడు రోజుల్లో అనగా ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెడుతోంది.