థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు మెల్లమెల్లగా ఆక్రమిస్తోంటే మూవీ ప్రమోషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు కూడా ఇండియా పెద్ద మార్కెట్ అయిపోయింది. అందుకే, మన వాళ్లు సినిమాలు చూడాలంటే మన వాళ్లతోనే మాట్లాడాలని హాలీవుడ్ స్టార్స్ కూడా డిసైడ్ అయిపోయారు. రీసెంట్ గా క్రిస్ ప్రాట్ కూడా అదే చేశాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తో ఆన్ లైన్ లో చిట్ చాట్ చేశాడు. ఆయన నటించిన సినిమా ‘ద టుమారో వార్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆ సినిమా గురించిన విశేషాలు వరుణ్ కి క్రిస్ వివరించాడు…
వరుణ్ ధవన్ తో హాలీవుడ్ స్టార్ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.
read also : సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2021పై సూర్య నిరసన గళం
వారిద్దరి మధ్యా అనేక ఆసక్తికర అంశాలు చర్చకొచ్చాయి. క్రిస్ ప్రాట్ కు హాలీవుడ్ సూపర్ స్టార్ అర్నాల్డ్ ష్క్వాజ్ నెగర్ మామ అవుతాడు. ఆయన గురించి ప్రస్తావించిన ‘ద టుమారో వార్’ హీరో ఇండియాకి వస్తానని చెప్పాడు వరుణ్ తో! ఎన్నో భిన్నత్వాలకు, ఏకత్వానికి ప్రతీక అయిన భారత్ లో పర్యటిస్తానని అన్నాడు. వరుణ్ ని తనకు తోడుగా ఉండాలని కోరాడు. అయితే, హాలీవుడ్ స్టార్ క్రిస్ ఇచ్చిన దేసీ ఇంటర్వ్యూలో అందర్నీ ఆకట్టుకున్న మూమెంట్స్ మాత్రం… ఆయన ‘జుడ్వా 2’ సినిమాలోని ‘టన్ టనా టన్’ పాటలోని హుక్ స్టెప్ చేసి చూపించటం! వరుణ్ లాగే చేతులు కదిలిస్తూ క్రిస్ కొన్ని క్షణాలు వీక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు!