అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి నెట్ఫ్లిక్స్ ఒక సరికొత్త తమిళ థ్రిల్లర్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో శ్రద్ధ శ్రీనాథ్ సంతోష్, ప్రతాప్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి ఫన్ కోసం ఆటలు ఆడాలి కానీ అదే ఆట ఆడుతుంటే నిజజీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సరికొత్త తమిళ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. వర్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు నిజజీవితంలో దానివల్ల సంఘటన చోటు చేసుకున్నట్టుగా ఈ థ్రిల్లర్ ట్రైలర్ కనిపిస్తోంది. అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే ఎన్నో సీక్రెట్స్ మరెన్నో మాస్కులు ఆవిష్కృతం కాబోతున్నట్టు కనిపిస్తోంది.
Also Read :OG: ఓజీ మూవీ ప్రీమియర్స్‌లో..స్క్రీన్‌ను చింపి అభిమానుల రచ్చ..
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ తమిళ థ్రిల్లర్‌ను రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహించారు, దీప్తి గోవిందరాజన్ రచన చేశారు, సెల్వా, కార్తిక్ బాలా సహ రచన చేశారు. టెక్నాలజీ కంట్రోల్లో లేకుండా పోతున్నప్పుడు, కుటుంబ విభేదాల తీవ్రతతో, రిలేషన్స్ బలహీనమవుతున్నప్పుడు, నిజమైన మరియు వర్చువల్ ప్రపంచాల మధ్య గీత కనుమరుగవుతున్నప్పుడు ఎవరిని నమ్మాలనే ప్రశ్న ఈ సిరీస్ లేవనెత్తేలా కనిపిస్తోంది. ఈ సిరీస్‌తో శ్రద్ధా శ్రీనాథ్ తన ఓటిటీ డెబ్యూ చేస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, వారితో పాటు సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంత్, ధీరజ్, మరియు హేమ నటిస్తున్నారు.