ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సినిమాలను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాలుగవ చిత్రంగా తెలుగులో మొదటి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం రాబోతోంది. న్యూ సినిమాటిక్ యూనివర్స్ అంటూ తెలుగు సూపర్ హీరో “హను-మాన్” అనే టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన “హను-మాన్” సూపర్ హీరో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. అలాగే టైటిల్ డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది. టైటిల్ థీమ్ పోస్టర్ హిమాలయాల అందాన్ని కళ్ళకు కడుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ చిత్రం ముఖ్యంగా సూపర్ హీరో ప్రేమికులకు సరికొత్త సినిమా అనుభవాన్ని అందించబోతోంది. కాగా ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది.