The Devil’s Fury – Gumma Banda Gumma Vikrant Rona Song
బాద్ షా, కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ ‘విక్రాంత్ రోణ’. కన్నడంలో అనూప్ భండారి దర్శకత్వంలో షాలినీ జాక్ మంజునాథ్, జాక్ మంజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ మూవీ కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని మరో గీతాన్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. సినిమాలోని విజువల్స్ కాకుండా, స్పెషల్ గ్రాఫిక్ వర్క్ తో ఈ పాటలోని కొంత భాగాన్ని రూపొందించారు. ఇందులో కథానాయకుడు విక్రాంత్ రోణ రాబిన్ హుడ్ తరహాలో పెద్దల సొమ్మును దోచుకుని, బీదలకు పంచిపెడుతుంటాడు. ఆ క్యారెక్టరైజేషన్ ను తెలియచేసే విధంగా ‘రాత్రి గుర్రం మీద స్వారీ, వీచే గాలి జతగా చేరి, కొల్లగొట్టే బందిపోటు చీకటిలో దొంగ లాగ…’ అంటూ సాకీ సాగింది. ‘గుమ్మ బండ గుమ్మ’ అనే హుక్ లైన్ తో కొనసాగిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా, అనూప్ భండారి, దీపక్ బ్లూ, హర్షిక దేవనాథ్, బి. అంజనీశ్ లోక్ నాథ్ పాడారు. ‘ద డెవిల్స్ ప్యూరీ’ అనే కాప్షన్ తో ఈ పాట విడుదలైంది. మూవీ ఎంత భారీగా ఉండబోతోందో ఈ పాటకు ఉపయోగించిన గ్రాఫిక్స్ చూస్తే అర్థమౌతుంది. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్విలిన్ ఫెర్నాడేజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు బి. అంజనీశ్ సంగీతం సమకూర్చారు. మొత్తం మీద రిలీజ్ కు ముందే ‘విక్రాంత్ రోణ’పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
https://www.youtube.com/watch?v=Gl5giMXO0EQ