‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!

Og India Tour

Og India Tour

‘OG India Tour’: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దేశవ్యాప్తంగా ‘OG ఇండియా టూర్’ పేరుతో భారీ లైవ్ కన్సర్ట్స్‌ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక మ్యూజికల్ టూర్ ఈ శనివారం హైదరాబాద్‌లో జరిగే భారీ ప్రోగ్రామ్‌తో అత్యంత వైభవంగా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా తమన్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ టూర్ గురించి తమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమా మ్యూజిక్‌కు వచ్చిన సక్సెస్ సెలబ్రేషన్ కోసమే ఈ ఇండియా టూర్‌ను ప్లాన్ చేశాం. ప్రస్తుతం ఓజీ మ్యూజిక్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే.. సోషల్ మీడియాలో మైకేల్ జాక్సన్ వీడియోలు వచ్చినా, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఓజీ మ్యూజిక్‌నే వాడుతున్నారు. అంతలా ఈ ట్యూన్స్ జనాదరణ పొందాయి. ఆ భారీ సక్సెస్‌ను అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశం” అని తమన్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆయన సంగీతం అందిస్తున్న లెనిన్ సినిమా గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తమన్. అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ సినిమా గురించి తమన్ మాట్లాడుతూ.. లెనిన్ కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడని అన్నారు. నిజానికి అఖిల్ ది జెన్యూన్ హార్ట్ అని, ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యూజికల్ ఈవెంట్స్ విషయానికి వస్తే హైదరాబాద్‌తో మొదలుకానున్న ఈ ఈవెంట్ టాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు పవన్ కల్యాణ్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాయి. ఈ శనివారం జరగబోయే లైవ్ కన్సర్ట్‌లో తమన్ అండ్ టీమ్ ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టబోతున్నారో వేచి చూడాలి.

×
×
Ad