NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘NBK 111’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్‌ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్.. సినిమా టీజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ పనుల గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘NBK 111’ చిత్రానికి సంబంధించిన టీజర్ వర్క్ పూర్తిగా పూర్తయిందని తమన్ అధికారికంగా వెల్లడించారు.
బాలయ్యను వేరే లెవెల్లో చూస్తారు..
టీజర్ అవుట్‌పుట్ గురించి తమన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ మాత్రం మామూలుగా లేదు. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పవర్‌ఫుల్‌గా వచ్చాయి. ముఖ్యంగా ఈ టీజర్‌లో బాలయ్య గారిని వేరే లెవెల్లో చూస్తారు” అంటూ వెల్లడించారు. బాలకృష్ణ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తోడు తమన్ ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తమన్ ఇచ్చిన ఈ అదిరిపోయే అప్‌డేట్‌తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్ వర్క్ పూర్తయినట్లు అధికారిక ప్రకటన రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి జూన్ 10న అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ఇప్పటి చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

