తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు విజయ్. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. గత నెలలో TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : HIT : ‘HIT – The 3rd Case’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడో తెలుసా..?
ఈ నేపథ్యంలో విజయ్ చివరి ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అట్లీ, వెట్రిమారన్ ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. తాజగా విజయ్ సినీ కెరీర్ లో నటించబోయే సినిమాను తమ బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసాయి. విజయ్ 69వ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతమే అందిస్తున్నాడు. మాస్టర్, తెలుగు దసరా సినిమాలకు పని చేసిన సత్యన్ సూరన్ విజయ్ సినిమాకు సినిమాటోగ్రాఫార్ గా వర్క్ చేయబోతున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన నేడో రేపో రానుంది. విజయ్ నటించిన రీసెంట్ సినిమా GOAT ప్రస్తుతం థియేటర్లో ఉంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన GOAT మిశ్రమ ఫలితం రాబట్టింది. H. వినోద్ దర్శకత్వంలో రానున్న చివరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.