Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay – Trisha Marriage: తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ – త్రిష కృష్ణన్ జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆది’, ‘కురువి’ వంటి సినిమాలతో ఈ జంట వెండితెరపై చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు కోలీవుడ్ నుంచి జాతీయ స్థాయి వరకు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత చేసిన సంచలన ఆరోపణలతో వీరి బంధం గురించి దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది.
15 ఏళ్ల గ్యాప్.. ‘లియో’తో మళ్లీ
నిజానికి స్టార్ హీరో విజయ్ – హీరోయిన్ త్రిషల మధ్య అఫైర్ ఉందనే వార్తలు ఈనాటివి కావు. 2004లో ‘గిల్లి’ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ వివాహితుడు కావడంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు 2008 తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2023లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ సినిమా కోసం ఈ జోడి మళ్లీ కలిసి కెమెరా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరూ పబ్లిక్ ఈవెంట్లలో, విజయ్ బర్త్‌డే వేడుకల్లో కలిసి కనిపిస్తుండటంతో రూమర్లు మళ్లీ షురూ అయ్యాయి.
Also Read
భార్య ఆరోపణలు.. విడాకుల పిటిషన్
ఫిబ్రవరి 2026లో విజయ్ భార్య సంగీత సోర్నలింగం విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయ్ ఒక స్టార్ హీరోయిన్‌తో అఫైర్ కొనసాగిస్తున్నారని ఆమె నేరుగా ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది విజయ్-త్రిషల సంబంధాన్ని ధృవీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్రిష విషయానికి వస్తే.. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే ఉన్నారు. గతంలో 2015లో వరుణ్ మనియన్ అనే వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగినా, నటనను వదిలేయాలని ఆయన కోరడంతో ఆ సంబంధాన్ని త్రిష తెంచుకున్నారని సమాచారం. తర్వాత 2025 అక్టోబర్‌లో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా, ఆమె వాటిని ఖండించారు. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (TVK పార్టీ తరపున) విజయ దుందుభి మోగించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడిన తర్వాత విజయ్ – త్రిషలు తమ బంధాన్ని అధికారికం వెల్లడించి, పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. విజయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు.
తాజావార్తలు
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
-
Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
-
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
-
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!