Telugu Movies This Week: ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Movies releasing in theatres this week: ఈవారం థియేటర్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పేరుకు పెద్ద సినిమా ఒక్కటే అయినా ఆసక్తికర సినిమాలు కూడా బరిలో ఉండడం విశేషం ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆపరేషన్ వాలెంటైన్
వరుణ్ తేజ్ హీరోగా మనుషి చిల్లర్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. పుల్వామా ఎటాక్స్ తర్వాత జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి రినైసన్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా మార్చి ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read
భూతద్దం భాస్కర్ నారాయణ
రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా తెరకెక్కించారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ కావడంతో టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ క్యాస్ట్ లేకపోయినా కంటెంట్ బావుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
చారి 111
వెన్నెల కిషోర్ హీరోగా సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా ఈ చారి 111 అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ఒక స్పై మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి.
వ్యూహం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా వ్యూహం. ఏపీ ప్రతిపక్ష పార్టీ నుంచి నమోదైన కేసుల నేపథ్యంలో అనేక వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాను మార్చి ఒకటో తేదీన రిలీజ్ చేసేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
ఇంటి నెంబర్ 13
ఇంటి నెంబర్ 13 అనే ఒక హారర్ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని అధికారిక ప్రకటన ఉంది. ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి, అమృతం అప్పాజీ, 30 ఇయర్స్ పృథ్వి, నెల్లూరు సుదర్శన్ వంటి వాళ్ళు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. పన్నారాయల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
రాధా మాధవం
వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను కూడా మార్చి ఒకటవ తేదీన రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!