IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBomma Piracy: టాలీవుడ్లో పైరసీ భూతం మరోసారి కలకలం రేపుతోంది. పైరసీ వెబ్సైట్లు అయిన ‘ఐబొమ్మ’ (iBomma), ‘బప్పం’ (Bappam) లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను యథేచ్ఛగా ఈ సైట్లలో అప్లోడ్ చేస్తుండటంతో నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రెండు వెబ్సైట్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసినట్లు తెలిపారు.
నాకు సంబంధం లేదు..
గతంలో ఒరిజినల్ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహించినట్లు ప్రచారంలో ఉన్న రవి అనే వ్యక్తి ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారు. ప్రస్తుతం నెట్లో అందుబాటులోకి వచ్చిన కొత్త ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో కేటుగాళ్లు ఐబొమ్మ బ్రాండ్ నేమ్‌ను వాడుకుంటూ కొత్తగా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి రన్ చేస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద, చిన్న సినిమాలన్నింటినీ ఈ కొత్త ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో కేటుగాళ్లు అప్లోడ్ చేస్తున్నారు. గతంలో ఐబొమ్మకు ఉన్న పాపులారిటీని ఆసరాగా చేసుకుని, సినిమా లవర్స్‌ను టార్గెట్ చేస్తూ అదే పేరుతో కొత్త డొమైన్లను సృష్టిస్తున్నారు. ఓటీటీ, థియేటర్ కలెక్షన్లపై ఈ పైరసీ సైట్లు తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సైట్లను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు? అనే కోణంలో ఐపీ అడ్రస్‌లు, డొమైన్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పైరసీ వెబ్సైట్లను బ్యాన్ చేయడంతో పాటు, వాటిని నడిపిస్తున్న నేరగాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!