AA 22 Atlee 6 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే దీపికను ఇందులో తీసుకున్నారు. అయితే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అట్లీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ గురించి మాట్లాడారు. ఆ మూవీ సినీ చరిత్రలోనే అతికొత్త టెక్నాలజీతో రూపొందిస్తున్నామని.. యావత్ దేశ సినీ ప్రియులంతా గర్వపడేలా ఉంటుందని చెప్పాడు.
Read Also : Gaddar Awards : బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న అల్లు అర్జున్
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటు హీరో, అటు డైరెక్టర్ ఒకేసారి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ సినిమాను కళానిధి మారన్ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
Read Also : Gaddar Awards Sets : గద్దర్ అవార్డు సెట్ అదిరింది..