Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ

Teja Sajja

Teja Sajja

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఆయన వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పెళ్లి గురించి సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు.

తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తనది అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమ వివాహం కాదని, పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ జరపబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాక, ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని ఆయన వెల్లడించారు.

ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, వీరి వివాహం అనంతరం హైదరాబాద్‌లో ఒక రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను ఆహ్వానించబోతున్నారు. ఇక తేజా సజ్జ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం మీద క్లారిటీ రాలేదు. అయితే, ఆ అమ్మాయికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తేజా సజ్జ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాబట్టి, ఇప్పటివరకు ఆయన ప్రేమ పెళ్లి గురించి జరిగిన ప్రచారం అంతా ప్రచారంగానే మిగిలిపోనుంది. అయితే, ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది అనే విషయాలు పెళ్లి సమయానికి వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.