యంగ్ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. తెలుగులో జాంబీ జోనర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఇదే కాగా.. ప్రేక్షకుల నుంచి ‘జాంబీ రెడ్డి’కి విశేషమైన స్పందన లభించింది. అయితే త్వరలో మరో విభిన్నమైన జోనర్ లో రూపొందనున్న చిత్రంలో తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. ప్రస్తుతం మెటీరియల్ దశలో ఉన్న ఈ చిత్రం స్క్రిప్ట్ ను ప్రశాంత్ వర్మ త్వరలోనే పూర్తి చేయనున్నారట. ఆ తరువాత తేజకు కథను వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. కాగా తేజ నటించిన తాజా చిత్రం ‘ఇష్క్’. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ లైన్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించిన ‘ఇష్క్’ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. మలయాళ చిత్రానికి రీమేక్ ఈ లవ్ డ్రామా ‘ఇష్క్’.