Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది. అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు కాస్త దూరమై, బాలీవుడ్లోనే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. కెరీర్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాల్సిన తమన్నా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ ఐటెం సాంగ్స్‌కే పరిమితం అవ్వడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో, తాజాగా తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మైల్స్టోన్ హిట్‌గా నిలిచిన ‘బాహుబలి’ (Baahubali) చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
‘నేటి పరిస్థితులను బట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమైనదిగా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాష (Regional Language) కు సంబంధించిన సినిమా కోసం ఆ రోజుల్లోనే రూ. 200 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి వ్యాపార పరంగా చూస్తే.. అది ఫ్లాప్‌కు దారితీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది. కానీ ఆ రోజుల్లో రాజమౌళి గారు తన విజన్‌ను నమ్మారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టే, అంతటి అద్భుతమైన గ్లోబల్ విజయాన్ని సాధించింది. లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి’ అని తమన్నా జక్కన్న విజన్‌ను కొనియాడింది.
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!