బాలీవుడ్ బ్యూటీ తాప్సీ విభిన్న కథలను ఎంచుకొంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా వుంది. ఇదిలావుంటే, తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై రీసెంట్గా తాప్సీ స్పందించింది. ‘మ్యాథ్యూస్ బాగా తెలిసిన వ్యక్తి అని.. మంచి సన్నిహితుడు కూడను అని తెలిపింది. అలాగే, సినిమా రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేదని తెలిపింది. మనం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేర్వేరుగా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం యేడాదికి ఆరు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినప్పుడే నేను పెళ్ళి చేసుకుంటాను’ అని వివరించింది.