పోలీసుల అదుపులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత అనూహ్యంగా మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌సిబి అధికారులు హైదరాబాద్‌కు చెందిన సిద్దార్థ్ పితానిని 28, 29, 27 ఎ సెక్షన్ల కింద కుట్రపన్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి ముంబైకి తరలించారు. మాదకద్రవ్యాల కేసులో సిద్దార్థ్ పితాని పాత్ర ఉన్నట్టు ఇటీవల ఎన్‌సిబి దర్యాప్తులో బయటపడింది. అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. కాగా ముంబైలోని తన బాంద్రా ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి సిద్ధార్థ్ నివసించేవాడు. జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణానికి ముందురోజు రాత్రి… అంటే తెల్లవారుజామున 1 గంటలకు సుశాంత్‌ను కలిశాను అని సిద్ధార్థ్ పోలిసుల విచారణలో వెల్లడించారు. గత ఏడాది ఆగష్టులో సిబిఐ సిద్ధార్థ్ తో పాటు కుక్ నీరజ్, దినేష్ సావంత్ ను ఇన్వెస్టిగేట్ చేసింది.
Also Read
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?