NTV Telugu Site icon

Surya : నా గురించి నెగటివ్‌ కామెంట్స్ చేస్తే విపరితమైన కోపం వచ్చేది

Studio Green

Studio Green

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిసున్న ఈ సినిమా నవంబర్‌ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం చెన్నైలో ‘కంగువా’ ఆడియో రిలీజ్‌ చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Allu Arjun : డేవిడ్ వార్నర్ కు ఐకానిక్ స్టార్ విషెస్‌

సూర్య మాట్లాద్దుతూ ” ఇన్నేళ్ల సినీ కెరీర్‌ లో ఎన్నో  ఎత్తుపల్లాలు  చూసాను, అందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదు. ప్లాప్ అయినప్పుడు వచ్చే పెయిన్ ను అనుభవిస్తేనే సక్సెస్‌ టేస్ట్ ను ఎంజాయ్‌ చేయగలం. ఒక ఐదేళ్ల క్రితం నేను వేరే వాడిలా ఉండేవాడిని. ఎవరైనా నా సినిమాల గురించి సోషల్‌మీడియాలో నెగటివ్‌ కామెంట్స్ చేస్తే, వాటిని చదివినప్పుడు  ‘రోలెక్స్‌’ లా మారిపోయేవాడిని. విపరితమైన కోపం వచ్చేది. రాసినవాడి తల పగలకొట్టాలి అనేంత కోపం ఉండేది. కానీ  క్షమించడం ఎంతో గొప్ప లక్షణమని  దర్శకుడు శివ చెప్పిన మాట నను ఎంతో మార్చింది. ఎవరైనా మిమ్మల్ని  ద్వేషించినా, తిట్టినా మీరు ప్రేమను మాత్రమే పంచండి.  నెగిటివ్ కామెంట్స్‌కు రిప్లైలు ఇచ్చుకుంటూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. టైమ్ చాలా  విలువైంది. అలాగే  ఈ సినిమా మీ అందరిని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. థియేటర్ లో మాత్రమే చూడవల్సిన సినిమా కంగువ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్”  అని అన్నారు.