Suriya : రూటు మార్చిన సూర్య.. ఆ యంగ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్..?
- వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న సూర్య
- కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో
- మలయాళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్స్ పరిమెంట్స్ చేయాలి కానీ ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాతో కాలక్షేపం చేయకూడదన్న జ్ఞాన నేత్రం తెరచుకోలేదు సూర్యకు. కంగువాతో ఖంగుతిన్నా ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు . కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో కూడా చూడబోతే ఎక్స్ పరిమెంటల్ మూవీలానే తోస్తుంది. ప్రయోగాలు చేయాలి ఫ్యాన్స్ కాలరెగరేసే సినిమాలు తీయాలని కమిటైన సూర్య అటుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు.
Also Read : Karthi : తండేల్ రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రెట్రో షూటింగ్ కంప్లీట్ కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 షూటింగ్ సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో చాన్నాళ్ల తర్వాత సూర్యతో త్రిష జతకట్టబోతుంది. అక్టోబర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎప్పుడో వడివాసల్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయ్యింది. ఈ రెండు కంప్లీట్ అయ్యాక రోలెక్స్ ఈ సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఈ మూడు సినిమాలు చేతిలో ఉండగానే మరో కథ వింటున్నాడట సూర్య. మలయాళ దర్శకుడు మిన్నల్ మురళి ఫేం డైరెక్టర్ అండ్ యాక్టర్ బాసిల్ జోసెఫ్ తో వర్క్ చేయబోతున్నాడని టాక్. బాసిల్ చెప్పిన కథ సూర్యకు నచ్చి గ్రీన్ ఇచ్చినట్లు ఇన్నర్ టాక్. సూర్య 47 చిత్రానికి బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ కొలాబరేషన్ కుదిరితే డిఫరెంట్ మూవీ అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు సూర్య.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!