Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు

Suriya Kartthi

Suriya Kartthi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డిజాస్టర్స్ లెక్కలు సరిచేశాడు. కరుప్పు అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇక తమ్ముడు కార్తీ వంతు. ఆల్రెడీ ఈ ఏడాది వా వాతియార్‌తో పలకరించేసిన కార్తీ.. సర్దార్2తో ఫ్లాప్ లెక్కలు తేల్చాల్సి ఉంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు హిట్ అండ్ ఫ్లాప్స్ కవర్ చేసేస్తున్నారు. సూర్య ఫ్లాప్‌లో ఉన్నప్పుడు కార్తీ హిట్ తీసుకుని మేనేజ్ చేస్తున్నాడు. కార్తీ సక్సెస్ ట్రాక్ తప్పినప్పుడు.. సూర్య హిట్టిచ్చి బ్యాలన్స్ చేస్తున్నాడు. ఈ ఏడాది వా వాతియార్‌తో కార్తీ డిజాస్టర్స్ చూస్తే.. సూర్య కరుప్పుతో పాటు విశ్వనాథ్ అండ్ సన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పడు కార్తీ వంతు.

వావాతియార్ ఫ్లాప్ లెక్కను వినాయక చవితికి సరిచేయాలనుకుంటున్నాడు కార్తీ. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సర్దార్2 సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతుంది. మాళవిక మోహనన్ అండ్ ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్స్. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది. అలాగే కన్ఫ్యూజక్ క్రియేట్ చేస్తోంది. సర్దార్2లో కార్తీ డ్యూయల్ షేడ్‌లో కనిపించబోతున్నాడు. టూ టైమ్ లైన్స్ పీరియడ్‌లో సినిమా సాగబోతుందని సమాచారం. చంద్రబోస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపిస్తూనే.. ఫ్యూచర్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్. ఇందులో ఎస్ జే సూర్య నెగిటివ్ రోల్‌ చేస్తున్నాడు. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు సర్దార్ 2 భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సర్దార్2తో ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ కవర్ చేస్తోన్న కార్తీ.. సక్సెస్ టేస్ట్ చేస్తాడో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.