కోలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారా..? ఆ రెండు సినిమాలు ఆటైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా..? అన్నా దమ్ముల సవాల్ తప్పదా…? సరికొత్త స్ట్రాటజీనా..? ఈ దీపావళి పండుగకు కోలీవుడ్‌లో బిగ్ ఫైట్ జరిగేట్లే కనిపిస్తోంది. క్రేజీ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు బాక్సాఫీసు దగ్గర నేరుగా ఫైట్‌కు దిగబోతున్నారన్నది లేటెస్ట్ తమిళ ఇండస్ట్రీ బజ్. కంగువా తర్వాత సూర్య నుండి రాబోతున్న మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న రెట్రో మే 1న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. రెట్రో రిలీజ్‌కు రెడీ కావడంతో మరో సినిమాను పట్టాలెక్కించాడు సూర్య. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 చేస్తున్నాడు.
Court Movie: తిరుపతిలో కోర్టు సినిమా తరహా ఘటన
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బొమ్మను దీపావళి పండుగకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 19 ఏళ్ల తర్వాత సూర్యతో జోడీ కడుతుంది త్రిష. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇక ఈ ఏడాది దీపావళి పండుగకు సూర్యతో పోటీ పడుతున్నాడు తమ్ముడు కార్తీ. 2022లో హిట్ అందుకున్న స్పై థ్రిల్లర్ సర్దార్ సీక్వెల్‌గా సర్దార్ 2ను ఎనౌన్స్ చేశాడు దర్శకుడు పీఎస్ మిత్రన్. రీసెంట్లీ ఈ మూవీ నుండి ప్రొలాగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తోంది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ బొమ్మను కూడా దీపావళికే తీసుకురావాలనుకుంటోంది చిత్ర యూనిట్. ఇదే నిజమైతే అన్నాదమ్ముల వార్ తప్పేట్లా లేదు. లేకుంటే.. మరో సినిమాకు ఛాన్స్ ఇవ్వకుండా పండుగ బాక్సాఫీసును తామిద్దరమే దున్నేద్దామనా ప్లానో..?