బాలీవుడ్ లో డియోల్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ధర్మేంద్ర తనయులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ బీ-టౌన్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, హేమా మాలినీ కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే, ఈ డియోల్స్ అందరితో బాటూ బాలీవుడ్ లో ఉన్న మరో టాలెంటెడ్ డియోల్… అభయ్! తనదైన రూట్ లో సాగిపోతూ నటనకు ప్రాముఖ్యం ఉండే పాత్రలే చేస్తుంటాడు అభయ్. ఆయనతో ఇంత వరకూ సీనియర్ డియోల్స్ అయిన సన్నీ కానీ, బాబీ డియోల్ కానీ నటించలేదు! ధర్మేంద్రతో కూడా అభయ్ డియోల్ ఇంత వరకూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు! బంధువే అయినా కూడా సన్నీ, బాబీ డియోల్స్ తెర మీద దూరంగానే ఉంటూ వస్తున్నాడు అభయ్ డియోల్…
తన కజిన్స్ సన్నీ, బాబీతో కలసి సినిమాలు చేయని అభయ్ డియోల్ కరణ్ డియోల్ తో మాత్రం ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు! కరణ్ డియోల్ … సన్నీ డియోల్ తనయుడు. ఈ మధ్యే బీ-టౌన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ యాక్టర్ అప్పుడే బాబాయ్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోగలిగాడు. కరణ్, అభయ్ డియోల్ ప్రస్తుతం ‘వెల్లే’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అందులోని బిహైండ్ ద సీన్స్ పిక్ ఒకటి కరణ్ ఇన్ స్టాలో షేర్ చేశాడు. ”సూపర్ ఎగ్జైటెడ్” అంటూ పేర్కొన్నాడు కూడా…
‘వెల్లే’ సినిమాని అజయ్ దేవగణ్ నిర్మిస్తుండగా దేవేన్ ముంజల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో విజయవంతమైన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రోచేవారెవరురా’కి ఇది బాలీవుడ్ రీమేక్…