Site icon NTV Telugu

పిసినారి సునీల్… ఇబ్బందుల్లో వెంకీ!

Sunil Role Revealed from F3 Movie

సునీల్ పిసినారి తనం కారణంగా వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతకూ విషయం ఏమంటే… ఇదంతా వ్యక్తిగత వ్యవహారం కాదు… ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన అంశం. అందులో సునీల్ ది పరమ పిసినారి పాత్ర అని, అతని దగ్గర అనివార్యంగా భారీ మొత్తాన్ని తీసుకున్న వెంకటేశ్, వరుణ్ తేజ్ సకాలంలో చెల్లించకపోవడంతో అనేక చిక్కుల్లో పడటమే ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది.

Read Also : పవన్ మూవీ నుండి ప్రసాద్ మూరెళ్ళ ఎందుకు తప్పుకున్నాడు!?

కమెడియన్ నుండి హీరోగానూ మారిన సునీల్ ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలూ పోషించాడు. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఎఫ్‌ 3’లో సునీల్ ను అందుకు భిన్నమైన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడట. వెంకీ, వరుణ్ తేజ్ తో పాటు సునీల్ పాత్ర సైతం ప్రేక్షకులను కడుపుబ్ప నవ్విస్తుందని అంటున్నారు. ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో మోర్ ఫన్ కు ఢోకా ఉండదని తెలుస్తోంది. మరి వెంకీ, వరుణ్ నుండి డబ్బులు రాబట్టుకోవడానికి సునీల్ ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? తన సొమ్ములు ఎలా రాబట్టుకున్నాడనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండక తప్పదు.

Exit mobile version