సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్.ఈరోజు, మజాకా హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. సందీప్ కిషన్, రీతు వర్మ ఆర్కె బీచ్‌లో డ్రింక్ చేస్తూ పట్టుబడటంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది వారి అరెస్టుకు దారి తీస్తుంది. వారి మధ్య ఘర్షణ త్వరలో ప్రేమగా మారుతుంది.ఇద్దరూ ప్రేమలో పడతారు. వారి కథతో పాటు, సందీప్ తండ్రి పాత్రలో రావు రమేష్ కు కూడా ఒక ప్రేమకథ వుంది. ఇది కథనానికి మరింత వినోదాన్ని జోడించింది.
Allu Arjun: అంత సీరియస్ ఇష్యూని ఈ డైరెక్టర్ అలా చేశాడేంటి?
తండ్రీకొడుకుల డైనమిక్ ఇందులో మెయిన్ హైలైట్. వారి కెమిస్ట్రీ నవ్వులు పంచింది. మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో త్రినాధ రావు నక్కిన మరోసారి తన మార్క్ చూపించారు,. “తమ్ముళ్ళు సీట్లు లేగుస్తాయి…” అనే లైన్‌తో దర్శకుడి సిగ్నేచర్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్ కిషన్ తన డైనమిక్ క్యారెక్టర్ లో అదరగొట్టారు, కంప్లీట్ ఎంటర్ టైనింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తండ్రి కొడుకులుగా రావు రమేష్ సందీప్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి అతిపెద్ద ఆకర్షణ. టీజర్‌లో అద్భుతంగా కనిపించే రీతు వర్మ తన పాత్రకు ఆహ్లాదకరమైన హ్యుమర్ కూడా తెస్తుంది. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ లవ్ ఇంట్రెస్ట్ గా అలరించింది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, లియోన్ జేమ్స్ ఎనర్జిటిక్ స్కోర్ టీజర్ ని మరింత ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. స్టంట్స్ ని పృథ్వి పర్యవేక్షిస్తారు.