Site icon NTV Telugu

Sukumar : యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా సుకుమార్ భార్య?

Game Changer Sukumar Review

Game Changer Sukumar Review

డైరెక్టర్‌గా సూపర్ బిజీ అయిన సుకుమార్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద, తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే, తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఈ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి పుష్ప 2 పూర్తిచేసిన సుకుమార్, రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన కథ మీద వర్క్ చేస్తున్నాడు.

Also Read :Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్

ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే, ఆ సినిమాకి ఇంకా సమయం చాలా ఉండడంతో, తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద రెండు, మూడు సినిమాలను పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. సుకుమార్ ఈ విషయం మీద ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నాడని, వీలైనంత త్వరగా ఆ సినిమాలు పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని అంటున్నారు. నిజానికి, సుకుమార్ భార్య గతంలో సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రొడక్షన్‌లో ఆమెకొంత అనుభవం సంపాదించడంతో, ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ బాధ్యతలు కూడా ఆమెకే అప్పగించాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version