Sukumar : యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా సుకుమార్ భార్య?
డైరెక్టర్‌గా సూపర్ బిజీ అయిన సుకుమార్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద, తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే, తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఈ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి పుష్ప 2 పూర్తిచేసిన సుకుమార్, రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన కథ మీద వర్క్ చేస్తున్నాడు.
Also Read :Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్
ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే, ఆ సినిమాకి ఇంకా సమయం చాలా ఉండడంతో, తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద రెండు, మూడు సినిమాలను పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. సుకుమార్ ఈ విషయం మీద ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నాడని, వీలైనంత త్వరగా ఆ సినిమాలు పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని అంటున్నారు. నిజానికి, సుకుమార్ భార్య గతంలో సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రొడక్షన్‌లో ఆమెకొంత అనుభవం సంపాదించడంతో, ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ బాధ్యతలు కూడా ఆమెకే అప్పగించాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
-
CM Revanth Reddy : బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ ఈవీ హబ్..
-
Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్ రిజిజు ధ్వజం
-
Ram Pothineni New Movie: డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని.. ఎప్పటికి దొరికేనో!
-
Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!