Mandadi : సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ నుంచి అదిరిపోయే ఇంటెన్స్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా బహుభాషా చిత్రం ‘మండాడి’ నుంచి సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో, ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చేతికి ఉన్న ఉంగరం, గడియారం, ఆయన చుట్టూ ఉన్న వస్తువులు మరియు బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వెండితెరపై ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో మెప్పించబోతున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రానున్న బోట్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతిభావంతుడైన నటుడు సూరి, సుహాస్‌తో కలిసి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ను పెంచేశాయి.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!