Jatadhara : సుధీర్ బాబు ‘జటాధర’ మొదలైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా నవ దళపతి సుధీర్ బాబు హీరోగా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో శనివారం నాడు జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
Vishwambhara : ఇంకా చెక్కుతున్నారు బాసూ.. మరో మెగా హీరో కూడా?
Also Read
జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో రూపొందుతోన్న జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే సినిమా ఇది’ అని అన్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. ‘జటాధర’ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్ ముందుకు రానుంది. థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ‘జటాధరా’ను ఉత్కంఠభరితంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ‘జటాధర’లో నిధి కోసం పోరాటం జరుగుతుంది.. కానీ పోరాడాలంటే కొన్ని శాపాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పోరాటం ఏంటి? ఈ శాపం ఏంటి? అని తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?