Maa Nanna Superhero: దసరాకి ‘మా నాన్న సూపర్ హీరో’ అంటున్న నవ దళపతి
- నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా 'మా నాన్న సూపర్‌హీరో'
- సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్
- దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer Babu Maa Nanna Superhero Releasing For Dussehra : హరోం హర అనే సినిమాతో నవ దళపతి టాగ్ పెట్టుకున్న సుధీర్ బాబు ఈ సారి ఎమోషనల్ మూవీ ‘మా నాన్న సూపర్‌హీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. హరోం హర ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది. అయినా వెనక్కు తగ్గకుండా జటాధర అనే సినిమా అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ‘మా నాన్న సూపర్‌హీరో’తో రెడీ అవుతున్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుందని, సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
Tollywood: టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ – 10 సినిమా న్యూస్..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ ఉన్న ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్ అని మేకర్స్ చెబుతున్నారు. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే రివిల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా అని చెబుతున్నారు. సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, ఆనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీ చేస్తూనే ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?