Suchir India : ప్రముఖ నటుడు సోనూసూద్ కు ‘సంకల్ప్ కిరణ్’ పురస్కారం
- సమాజ సేవే లక్ష్యంగా సుచిరిండియా ఫౌండేషన్
- ప్రముఖ నటుడు సోనూసూద్ కు ఈ ఏడాది అవార్డ్
- నవంబర్ 28వ తేదీన 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ ఎప్పుడు ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రముఖులు చేస్తున్న సేవలను గుర్తించి ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తుంది. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరోకి ఈ అవార్డ్స్ అందజేశారు. ఈ ఏడాది ‘సంకల్ప్ దివాస్’లో ప్రముఖ నటుడు సోనూసూద్ ను ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరించనున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Also Read : Tollywood : కీర్తిసురేష్ టాలీవుడ్ కు నై నై.. బాలీవుడ్ కు సై..సై..
Also Read
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
ప్రస్తుత ఆకలిని తీర్చే నిత్యావసర వస్తువులను అందించడం మొదలుకొని, భవిష్యత్ కి బాటలు వేసే వస్తులను అందించడం వరకు డాక్టర్ వై. కిరణ్ నెలకొల్పిన ‘సంకల్ప్ దివాస్’ చేస్తోంది. అనాథ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులకు, దివ్యాంగులకు వంటి వారు జీవితంలో ముందుకు అడుగులు వేసేలా అండగా నిలబడుతుంది. ఒంటరి పేద మహిళలకు కుట్టు మిషన్లు లేదా ఇతర ఉపయోగకర యంత్రాలను అందిస్తుంది. ఇలా కేవలం సహాయం చేసి చేతులు దులుపుకోకుండా, వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ, మెరుగైన జీవితాన్ని అందిస్తుంది సంకల్ప్ దివాస్. అలాగే ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం ద్వారా, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనను మరెందరికో కలిగేలా చేస్తోంది.
తాజావార్తలు
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?