మినిస్టర్ రంగారావుగా ‘శుభలేఖ’ సుధాకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయిన జోహార్ మూవీలో శుభలేఖ సుధాకర్… సుభాష్ చంద్రబోస్ అనుయాయుడి పాత్రను పోషించి మెప్పించాడు. అనాధ బాలల కోసం అహరహం శ్రమించే పాత్ర అది. అలానే ఈ యేడాది విడుదలైన పలు చిత్రాలలోనూ సుధాకర్ నటించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో సాధువుగా నటించిన సుధాకర్… ఆ తర్వాత అలీ హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్లోనూ కీలక పాత్ర పోషించారు. అలానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో ముగ్గురమ్మాయిలు నివాసం ఉండే ఇంటి ఓనర్ గా, వారికి సహకారం అందించే చక్కని పాత్రలో కనిపించారు. ఆ మధ్య వచ్చిన జాతిరత్నాలులో మేడ్ ఇన్ ఇండియా – మేకిన్ ఇండియాను ప్రోత్సహించే ఓ గొప్ప పారిశ్రామిక వేత్త పాత్రకు శుభలేఖ సుధాకర్ జీవం పోశారు. తాజాగా ఆయన నటించిన మరో సినిమా ఈ నెల 11న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అర్థ శతాబ్దం మూవీలో శుభలేఖ సుధాకర్ మంత్రి రంగారావు పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా గురించి శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ, పరిస్థితులు, ప్రాముఖ్యతలు మారిపోవడం వల్ల మంచి చేయాలనుకున్న వ్యక్తులు కూడా మంచిని సకాలంలో చేయలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి నా బాధ్యత అని ఫీలై చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అదే `అర్ధ శతాబ్దం` మూవీ అన్నారు. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!