టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను వదిలించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో A1 స్టార్ NTR అనే తగిలించుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అవడంతో వెంటనే మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.
Also Read :Tollywood : టాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలను పట్టించుకునేదెవరు
అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారు. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ నేమ్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని మెన్షన్ చేసారు. ఇక వీరి ఇద్దరి దారిలోనే మరో యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని కూడా వెళ్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అవడంతో అప్పటి నుండి ఉస్తాద్ రామ్ పోతినేని అని టైటిల్ ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ ను తీసేసాడు రామ్. తనకు ఎప్పటి నుండో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ ను కంటిన్యూ చేస్తూ రాబోతున్న ఆంధ్ర కింగ్ తాలూక పోస్టర్ లోను మెన్షన్ చేసాడు. ఇలా అక్కర్లేని ట్యాగ్ లు తగిలించుకుని ప్లాప్ లు రావడంతో రామరావు, రామ్ చరణ్, రామ్ పోతినేని వాటిని తొలగించారు.
