హీరో ఎలివేషన్లకు, కటౌట్లకు ఎట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ ఇటీవల కాలంలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలొస్తే పట్టించుకోవడం లేదు. లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. ఈ ఏడాది కూడా బాహుబలి బ్యూటీస్ అనుష్క, తమన్నాతో పాటు మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆడియెన్స్ ఈ సినిమాలు పట్టించుకోలేదు.
Also Read : Mass Maharaj : మాస్ జాతర రిజల్ట్.. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్
గ్లామరస్ డాళ్ తమన్నా ఈసారి డిఫరెంట్‌గా అవతారమెత్తిన ఫిల్మ్ ఓదెల2. సంపత్ నంది నిర్మించిన ఈ సినిమాలో నాగ సాధువు పాత్రలో శివ శక్తిగా పవర్ ఫుల్ రోల్ చేసింది మిల్కీ బ్యూటీ. ఏప్రిల్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది. ఇక మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ సరికొత్త కాన్సెప్ట్ పరదాతో పలకరిస్తే పాజిటివ్ రెస్పాన్స్ తప్ప పైసా వసూల్ కాలేదు. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ తగ్గుతున్నప్పుడల్లా.. వాటికి వెయిటేజ్ తెచ్చేందుకు స్వీటీ ట్రై చేస్తోంది. అరుంధతితో భారీ హిట్ అందుకున్న అనుష్క బాహుబలి తర్వాత పూర్తిగా ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలకు షిఫ్టైంది. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో కాస్తో కూస్తో మహిళా ప్రాధాన్యత చిత్రాలకు ఊపిరి పోసింది. ప్రమోషన్లకు హ్యాండిచ్చినా అనుష్క క్రేజ్ వేరే లెవల్.. కానీ ఘాటీ విషయంలో వర్కౌట్ కాలేదు. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఏమీ లేకపోవడంతో తిప్పి కొట్టారు ఆడియన్స్. దీంతో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పి మరి సినిమాలకు దూరంగా ఉంది.